• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బండలాగుడు పోటీల్లో ప్రొద్దుటూరు విజయం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ప్రొద్దుటూరుకు చెందిన చంద్ర ఓబులరెడ్డి వృషభాలు ప్రథమ స్థానం సాధించి యూనికార్న్ బైక్ గెలుచుకున్నాయి. గన్నవరం ఎడ్లు రూ.లక్ష, సూర్యాపేట ఎడ్లు రూ.80 వేలు, పెద్దకొట్టాల ఎడ్లు రూ.60 వేల బహుమతులు పొందాయి. విజేతలకు ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి మంగళవారం బహుమతులు అందజేశారు.

March 25, 2026 / 08:37 AM IST

‘పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలి’

E.G: APలోని పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లులను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని MP పురంధేశ్వరి కోరారు. దేశంలోనే పామాయిల్ సాగు APలో అధికమని పేర్కొన్నారు. ప్రభుత్వ, సహకార మిల్లుల్లో పాత పద్ధతుల వల్ల నూనె దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని వివరించారు. మిల్లులను ఆధునీకరించడం ద్వారా దిగుబడి పెరిగి రైతులకు లాభదాయకమైన ధర లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

March 25, 2026 / 08:36 AM IST

తడిచిన మిర్చి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: అమరావతిలో అకాల వర్షానికి తడిచిన మిర్చి పంటను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు రాజశేఖర్ యాదవ్, చిలకా నాగలక్ష్మితో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

March 25, 2026 / 08:36 AM IST

నెల్లూరులో యువకుడి మృతి

నెల్లూరులో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అయ్యప్ప గుడి సమీపంలోని ఓ మెడికల్ షాప్ పక్కన యువకుడి మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించి వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్ ఫోన్ మోగింది. వీఆర్వ్ కాల్ మాట్లాడగా.. ఆ ఫోన్ తన తమ్ముడు కమలాకర్ (37)ది అని తమది నంద్యాల అని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 08:35 AM IST

పేలిన బస్సు టైరు.. 10 మందికి గాయాలు

నంద్యాల జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. చాబోలు హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పోలీసులు చేరుకుని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను సురక్షితంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌కు చేర్చారు.

March 25, 2026 / 08:31 AM IST

మున్సిపాలిటీలో పెరగనున్న వార్డుల సంఖ్య

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెరగనుంది. జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించి కొత్త వార్డులను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలమంచిలి మున్సిపాలిటీలో 46,732 జనాభా ఉండగా ప్రస్తుతం 56,000 జనాభా ఉంది. దీంతో 25 వార్డుల సంఖ్య 36కు పెరిగే అవకాశం ఉంది.

March 25, 2026 / 08:29 AM IST

జీవీఎంసీలో వార్డుల పెంపు దిశగా అడుగులు

VSP: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వార్డుల సంఖ్య సవరణకు సిద్ధమైంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్‌లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా నిర్ణయించింది. ప్రస్తుతం 98 వార్డులు ఉన్న జీవీఎంసీలో జనాభా 24 లక్షలు దాటడంతో వార్డులు పెరిగే అవకాశం ఉంది.

March 25, 2026 / 08:23 AM IST

యూటీఎఫ్ నిరాహార దీక్షకు ఏపీ ఎన్జీవోల సంఘీభావం

SS: కదిరి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చేపట్టిన నిరాహార దీక్షకు ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆత్మరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ డివిజన్ నాయకులు బాషా, ఓబులేసు కూడా మద్దతు ప్రకటించారు. యూటీఎఫ్ ఉద్యమాలకు మరింత శక్తినిచ్చేలా వారు సమావేశంలో ప్రసంగించారు.

March 25, 2026 / 08:18 AM IST

‘జాబ్ క్యాలెండర్ పేరిట మోసం’

ATP: జాబ్ క్యాలెండర్ పేరిట చంద్రబాబు సర్కారు యువతను మోసం చేస్తోందని వైసీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్ అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 1.72 లక్షల కొలువులు ఖాళీగా ఉంటే కేవలం 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్‌లను విడుదల చేశామన్నారు.

March 25, 2026 / 08:16 AM IST

జిల్లాలో ఇంధన నిల్వలు పుష్కలం: కలెక్టర్

W.G: జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సరఫరాలో ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 81216 76653 కాల్ సెంటర్ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు.

March 25, 2026 / 08:15 AM IST

ఆపదలో అండగా ‘శక్తి యాప్’: సీఐ

ELR: ఆపదలో ఉన్న మహిళలు, బాలికలకు ఒక్క క్లిక్‌తో పోలీసుల సాయం అందుతుందని ఏలూరు త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఏలూరు బాలికల వసతి గృహంలో ‘శక్తి యాప్’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో ‘SOS’ బటన్ క్లిక్ చేసి పోలీసుల తోడ్పాటు పొందాలని సూచించారు.

March 25, 2026 / 08:15 AM IST

‘సీఎం పర్యటనకు వింజమూరులో విస్తృత ఏర్పాట్లు’

NLR: వింజమూరులో ఏప్రిల్ 1న జరిగే “రైతన్న మీసేవలో” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను మంగళవారం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్, వేదిక, పార్కింగ్ వంటి సౌకర్యాలను తనిఖీ చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

March 25, 2026 / 08:15 AM IST

కౌతాళంలో ఘర్షణ.. కళ్లలో కారం చల్లి దాడులు

KRNL: కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇవాళ గ్రామం మీదుగా ఇసుక ట్రిప్పర్లు వెళ్లవద్దని కోరిన తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్ర రెడ్డి వర్గంతో వాగ్వాదానికి దిగింది. వివాదం తీవ్రరూపం దాల్చి కళ్లలో కారం చల్లి, మారణాయుధాలతో దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఘటనపై కౌంటర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

March 25, 2026 / 08:14 AM IST

అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరాముడు

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి శ్రీరాముడు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.

March 25, 2026 / 08:14 AM IST

దొంగతనం కేసులో నిందితులకు 5 నెలల జైలు శిక్ష

ప్రకాశం: టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఒక మోటార్ సైకిల్ వల్లూరు ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీ పార్కింగ్ లో ఉన్న మరో మోటార్ సైకిల్ దొంగలించినట్లు 2025లో కేసు నమోదయింది. ఈ ఘటనపై ఎస్సై నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్‌లకు రూ.10,000 జరిమానా 5నెలల జైలుశిక్ష విధించినట్లు ఎస్సై చెప్పారు.

March 25, 2026 / 08:11 AM IST