E.G: పెరవలి మండలం కాకరపర్రు గ్రామం నందు శ్రీ ఆదివారం జరిగిన గంటాలమ్మ దేవి అమ్మవారి వాయ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు మంత్రి సూచించారు.
బాపట్ల: జిల్లాలో నూతన టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం లాంఛనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు కూడా ఈ భూమిపూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
సత్యసాయి: వైసీపీ నేతలకు హిందూ మతంపై నమ్మకం లేదని, వారిది కపట ప్రేమ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎం.ఎస్.రాజు విమర్శించారు. శాసనమండలిలో చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని అపచారం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో లడ్డూ కల్తీ, తలనీలాల అక్రమాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఎమ్మెల్యే ఆరోపించారు.
KRNL: దిబ్బనకల్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి సంపును సర్పంచ్ పెద్దలక్ష్మి, టిడిపి నాయకులు లక్ష్మన్న ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సహకారం గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మద్దతుతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
KDP: ప్రొద్దుటూరు సమీపంలోని అమృత నగర్ ప్రభుత్వ కాలనీలో పేదల నివాసాల నుంచి అనధికార ప్రైవేట్ వెంచర్ సిరిపురి కాలనీకి తాగునీటి పైప్ లైన్ నిర్మిస్తున్న పనులను పంచాయతీ తీర్మాణం మేరకే చేపట్టినట్లు సర్పంచ్ శివచంద్రారెడ్డి తెలిపారు. అయితే, అమృతనగర్ వాసుల ఫిర్యాదు మేరకు పైప్ లైన్ పనులను నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వెల్లడించారు.
SKLM: శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలింగుల సంక్షేమానికి రాజగోపాలరావు చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ సంతోష్ తెలిపారు.
VSP: విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వివరించారు. సభ్యత్వ నమోదు విధానం, చేపట్టాల్సిన చర్యలపై ఇంచార్జిలకు సూచనలు ఇచ్చారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.
కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో పట్టణంలో సాగుతున్న రోప్ లైట్ పనులను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింబిలి వెంకటరమణ పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాళ్ల ఉమామహేష్, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
E.G: 70వ సింగారమ్మ జాతర మహోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో పాల్గొని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌కు ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో 49,579 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్, తాగునీరు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.
TPT: దొరవారిసత్రం నూతన ఎస్ఐగా గరికపాటి వెంకటేశ్వర చౌదరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మండల పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. గతంలో 27-12-2024న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలపై దుర్భాషలాడారని C.C నాయుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.