VZM: సమానత్వం విద్య సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడుబాబు అన్నారు. పూలే జయంతి పురస్కరించుకుని జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో, కలెక్టరేట్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, దేవర కిరణ్ పాల్గొన్నారు.
AKP: నాతవరం మండలం వైబీ.అగ్రహారం గ్రామంలో శ్రీ మైసమ్మతల్లి 4వ వార్షికోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కోసూరి విజయ, బుజ్జి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న అన్నసమారాధన ఏర్పాటు చేశామని ధర్మకర్త తెలిపారు.
గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండా మంగళగిరి నుంచి తెనాలి మీదుగా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. గత రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను డీఎస్పీ జనార్ధనరావు పట్టుకొని సీజ్ చేశారు. చక్రాయపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఈ దందాలో కీలక సూత్రధారిగా గుర్తించారు. నిందితుడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.
AKP: దేశంలో మహిళా విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పునాదులు వేసినట్లు అనకాపల్లి డీఎస్‌పీ శ్రావణి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి శ్రావణి పూలమాలవేసి నివాళులర్పించారు. కుల రహిత సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదిగా పేర్కొన్నారు. పూలే ఆశయాలను సాధించాలని ఆమె పిలుపునిచ్చారు.
GNTR: గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ పిఎమ్.సత్యవేణి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, మహిళా విద్య, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
CTR: బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సేవలు, ముఖ్యంగా విద్యా రంగంలో చేసిన కృషి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
TPT: సాంకేతిక లోపంతో ఇవాళ ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30గంటల నుంచి తిరుమలలో అన్నమయ్య భవన్ సమీపాన ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద 800 టికెట్లను నేరుగా జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలి. రేపటి నుంచి మళ్లీ ఆన్‌లైన్ ద్వారానే టికెట్లు ఇస్తారు.
AKP: యువత మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు. పరవాడ సంతబయల జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేమన్నారు.
విశాఖ కలెక్టరేట్‌లో సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు విశాఖ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చందనోత్సవంలో ఎటువంటి లోటుపాట్లు జరగరాదని, మంచినీళ్లు, క్యూ లైన్‌లు, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ATP: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. మొత్తం 275 ఇళ్లు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్ చేశారు. అలాగే, 19 మంది రౌడీషీటర్లు, 324 మంది అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
NLR: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. సావిత్రీబాయి పూలేతో కలిసి మహిళా విద్యకు ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తూ, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
PLD: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెంలో జరిగిన సూర్యఘర్ ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో మంత్రి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జలధార ప్రాజెక్టు విజయానికి విశేష కృషి చేసిన కలెక్టర్‌ను మంత్రి ఘనంగా సన్మానించారు.
W.G: భీమవరం తహసిల్దార్ ఆఫీస్ ఆవరణలో విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూలే సేవా సమితి అధ్యక్షులు M.V.R. అప్పాజీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు పూలే అన్నారు. షేక్ కాసిం, అల్లు శ్రీనివాస్, బాషా తదితరులు పాల్గొన్నారు.