• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27 పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం

VZM: ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిరీష బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోడ పత్రికలను విడుదలచేస్తూ.. ఆరోజు ఉదయం అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని, సాయంత్రం 4 గంటలకు వనం గుడి నుంచి గంట స్తంభం మీదుగా హుకుం పేట చేరుకుంటుందన్నారు. 28న మూడు లాంతర్లు వద్ద గుడికి చేరుకుంటుందని తెలియజేశారు.

April 2, 2026 / 06:03 AM IST

కోదండ రాముడి కళ్యాణోత్సవంలో CM దంపతులు

కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 6వ సారి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీఎం దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పండు వెన్నెల్లో సుమారు 55వేల మందికిపైగా భక్తులు కళ్యాణాన్ని తిలకించారు.

April 2, 2026 / 06:03 AM IST

నూతన సచివాలయ భవనం ప్రారంభం

ASR: నూతనంగా నిర్మించిన కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గ్రామ సచివాలయ భవనం బుధవారం ప్రారంభమైంది. పంచాయతీ సర్పంచ్ పీటా సింహాచలం, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బషీర్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో కలిసి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ సచివాలయ భవనం లేక పంచాయతీ, సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు.

April 2, 2026 / 06:01 AM IST

మైనర్లకు వాహనాలిస్తే చర్యలు తప్పవు: డీఎస్పీ

ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక పరేడ్ మైదానంలో అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైనే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ఆర్థిక భారం గురించి వివరించారు.

April 2, 2026 / 06:00 AM IST

పిన్నెల్లితో ఎమ్మెల్సీ భేటీ

PLD: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మాచర్లలోని ఆయన నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్సీ, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా చేపట్టబోయే పలు కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.

April 2, 2026 / 05:50 AM IST

నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో 2025-26 సంవత్సరంలో రూ.6.82 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు చేయాల్సి ఉండగా మార్చి 31వ తేదీ నాటికి రూ.5.82 కోట్లు వసూలు అయింది. రాష్ట్రంలో ఇంటి పన్నుల వసూళ్లలో నర్సీపట్నం మున్సిపాలిటీ 11వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుల బకాయిలకు సంబంధించి వడ్డీపై 50% రాయితీ ప్రకటించిన తర్వాత పలువురు చెల్లింపుకు ముందుకు వచ్చారు.

April 2, 2026 / 05:48 AM IST

జిల్లాలో పెరిగిన మున్సిపల్ వార్డులు.. ఎన్నంటే..!

కడప: జిల్లాలో ప్రస్తుతం 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. దీంతో కౌన్సిలర్ల సంఖ్య కూడా పెరగనుంది. జిల్లాలో 44 మంది కౌన్సిలర్లు పెరగనున్నారు. ప్రొద్దుటూరులో 41 నుంచి 52, పులివెందులలో 33 నుంచి 40, బద్వేల్‌లో 35 నుంచి 40, రాజంపేటలో 29 నుంచి 32, మైదుకూరులో 24 నుంచి 32, జమ్మలమడుగులో 25 నుంచి 32, ఎర్రగుంట్లలో 27 నుంచి 28కి పెరగనుంది.

April 2, 2026 / 05:47 AM IST

డిఈఈ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

CTR: కార్వేటినగరంలో డీఈఈ సెట్ 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి పంపాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 2, 2026 / 05:21 AM IST

డ్రగ్స్‌పై కలెక్టర్ కఠిన చర్యలు

CTR: జిల్లాలో అక్రమ డ్రగ్స్, అబార్షన్ కిట్ల దుర్వినియోగం, లింగ నిర్ధారణ పరీక్షలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. డ్రగ్ & మెడికల్ రెగ్యులేషన్స్‌పై జరిగిన సమీక్షలో, నార్కోటిక్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్ షాపులు రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

April 2, 2026 / 05:20 AM IST

లోక్ అదాలత్‌లో 80 కేసులు పరిష్కారం

GNTR: జాతీయ లోక్ అదాలత్‌లో మంగళగిరి రూరల్ పోలీస్ పరిధిలో 80 కేసులు విజయవంతంగా పరిష్కరించారు. ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో చురుకైన పాత్ర పోషించిన ఎస్సై చిరుమామిళ్ల వెంకట్‌ను ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. సమన్వయంతో కేసుల పరిష్కారం అభినందనీయమని ఆయన తెలిపారు.

April 2, 2026 / 05:19 AM IST

ఘరానా దొంగ అరెస్ట్

ప్రకాశం: సింగరాయకొండ రాఘవయ్య కాలనీలో మార్చి 13 జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. అనిల్ అనే వ్యక్తి ఇంట్లో చీమకుర్తికి చెందిన హరిబాబు అనే దొంగ 30 గ్రాముల బంగారం, 548 గ్రాముల వెండిని చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన వస్తువులను రికవరీ చేసినట్లు ఎస్సై మహేంద్ర నిన్న మీడియాకు తెలిపారు.

April 2, 2026 / 05:13 AM IST

ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం

CTR: చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 4న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు తగిన సమాచారంతో రావాలని సూచించారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తామని చెప్పారు.

April 2, 2026 / 05:13 AM IST

కర్మక్రియలకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరు

CTR: తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామానికి చెందిన నవీన్ కుమార్ తల్లి భారతీ కర్మక్రియలకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి భారతీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఆయన పరామర్శ తెలియజేసి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 2, 2026 / 01:52 AM IST

గ్రీన్ ఫీల్డ్ హైవేపైకి వాహనాల అనుమతి

CTR: చిత్తూరు-తచ్చూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపు పూర్తయ్యాయి. వాహనాల ట్రయల్ రన్లో భాగంగా పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దీంతో పలు వాహనాలు ప్రయాణించాయి. చిత్తూరు నుంచి తమిళనాడులోని ఊత్తుకోట వరకు 95 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ మొత్తం దూరాన్ని ఒకటిన్నర గంటలోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

April 2, 2026 / 01:45 AM IST

జగన్‌కు మతిభ్రమించింది: కిరణ్ రాయల్

TPT: జగన్‌కు కనీస పరిజ్ఞానం లేదని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. డమ్మీ గన్, కోడికత్తితో ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ‘జగన్‌కి మతి భ్రమించిందని అందుకే రాష్ట్రాలకు రాజధానే అవసరం లేదని మాట్లాడుతున్నారు. మావిగన్ అంటూ వింత భాష్యం చెబుతున్నారని, మందులు మర్చిపోయారు. లండన్ వెళ్లి మందులు తెచ్చుకోవాలని సూచించారు.

April 2, 2026 / 01:39 AM IST