CTR: కార్వేటినగరంలో డీఈఈ సెట్ 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూర్తి చేసి పంపాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.