• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆస్థి పన్నుపై వడ్డీకి 50% రాయితీ పొడిగింపు

TPT: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను, ఖాళీ జాగా పన్నుల బకాయిలపై వడ్డీకి 50 శాతం రాయితీ పొందేందుకు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. బకాయిలను ఒకేసారి చెల్లించిన యజమానులు ఈ రాయితీ పొందవచ్చని పేర్కొన్నారు. గృహ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను చెల్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

April 3, 2026 / 07:15 AM IST

ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా తనిఖీలు

బాపట్ల: జిల్లాలో పోలీసులు ప్రైవేట్ వాహనాలు, ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రైవర్లకు ఆల్కహాల్ పరీక్షలు, వాహన పత్రాలను పరిశీలిస్తున్నామన్నారు. బస్సుల్లో ప్రమాదకర వస్తువులు లేకుండా, ప్రమాదాల నివారణపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

April 3, 2026 / 07:13 AM IST

అమరావతికి గ్రీన్ సిగ్నల్.. పల్లె నివాసంలో వేడుకలు

సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదముద్ర లభించిన సందర్భంగా పుట్టపర్తిలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ నివాసంలో దీపాలు వెలిగించి సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన చారిత్రాత్మక రోజని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

April 3, 2026 / 07:12 AM IST

కలెక్టరేట్‌లో వైభవంగా జయహో అమరావతి

ASR: రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించిన నేపథ్యంలో పాడేరులో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం రాత్రి కలెక్టరేట్‌లో జయహో అమరావతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అధికారులు అందరి మధ్య కలెక్టర్ దినేష్ కుమార్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజధాని బిల్లు ఆమోదం పొందడం అభివృద్ధికి సూచిక అన్నారు.

April 3, 2026 / 07:09 AM IST

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి: జగన్

CTR: వైసీపీ సోషల్ మీడియా, ఐటీ వింగ్ విభాగం ఎంతో కీలకమని.. ఇందులోని సభ్యులు ఉత్సాహంగా పనిచేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఆ విభాగాల సభ్యులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జగన్‌ను కలిశారు.

April 3, 2026 / 07:09 AM IST

పులి కదలికలు.. రంగంలోకి దిగిన రెస్యూ టీం

తూ.గో: సీతానగరం మండలం పెదకొండేపూడిలో పులి కదలికలు గురువారం కలకలం రేపాయి. కొండపై ఉన్న పులి చీకటి పడేసరికి చిట్టిబాబాజీ ఆశ్రమం గోశాల వైపు రావడాన్ని ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. గోశాలలో 400కు పైగా ఆవులు ఉండటంతో అటవీశాఖ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. దూడను ఎరగా వేసి, మత్తు మందు గన్లతో పులిని బంధించేందుకు బృందం సిద్ధమైంది.

April 3, 2026 / 07:09 AM IST

‘ఈ నెల 6 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం’

PPM: ఈ నెల 6 నుంచి జిల్లాలో పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుందని DEO పి. బ్రహ్మజీ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ స్దానిక DVMM హై స్కూల్‌, గవర్నమెంట్‌ గర్ల్‌ హై స్కూల్‌ రెండు కేంద్రాల్లో ఈ నెల 15 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

April 3, 2026 / 07:06 AM IST

జిల్లాకు సీఎం చంద్రబాబు రాక?

ATP: CM చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో రాష్ట్రస్థాయి ‘జలధార’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మరోవైపు అదే రోజున అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.

April 3, 2026 / 07:04 AM IST

నేడు మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు 6 పడకల డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 9.30 గంటలకు రామచంద్రపురం లెప్రసీ కాలనీలో 30 ఇళ్లకి మరమ్మతు పనుల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారు.

April 3, 2026 / 07:03 AM IST

జిల్లా ప్రజలకు అలెర్ట్

SKLM: రానున్న రెండు రోజులు జిల్లాలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ గురువారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో 15 మండలాల్లో తీవ్రవడగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. వడగాలుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

April 3, 2026 / 07:02 AM IST

రామచంద్రపురంలో మంత్రి విజయోత్సవ ర్యాలీ

కోనసీమ: రామచంద్రపురంలో గురువారం రాత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో అమరావతి విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు గుర్తించడం శుభసూచికమని మంత్రి పేర్కొన్నారు. CM చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి, ప్రధాని మోదీ చొరవతోనే ప్రజల కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

April 3, 2026 / 06:59 AM IST

నేడు అల్లూరులో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పర్యటన

నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం అల్లూరు పట్టణంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.

April 3, 2026 / 06:59 AM IST

లాభాల బాటలో సహకార బ్యాంకు

GNTR: జిల్లా సహకార బ్యాంకు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది రూ.45 కోట్ల లాభం సాధించి ఏకంగా 89% వృద్ధి నమోదు చేసింది. డిపాజిట్లు రూ.222 కోట్లు పెరిగడంతో రూ.1635 కోట్లకు చేరాయి. రాష్ట్ర బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులు రూ.502 కోట్లు తగ్గాయి. కాగా, రైతుల పంట రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఛైర్మన్ మక్కెన మల్లికార్జున తెలిపారు.

April 3, 2026 / 06:54 AM IST

ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్.. ప్రజల ఆవేదన

NLR: అనంతసాగరం మండలం సంజీవ్ నగర్‌లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. వాటర్ ట్యాంకుకు ఉన్న పిల్లర్లలో రెండు కాంక్రీట్ ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. గురువారం ప్రజలు మాట్లాడుతూ.. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

April 3, 2026 / 06:52 AM IST

వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి స్థానిక ఎస్సై సాంబశివయ్య వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి వారి డ్రైవింగ్ లైసెన్సులు పరిశీలించారు. ఇటీవల మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

April 3, 2026 / 06:52 AM IST