• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హాస్టల్ తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

WG: తాడేపల్లిగూడెం 35వ వార్డులోని హాస్టల్‌ను నిన్న మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతులు, సదుపాయాలు, తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు కమిషనర్ ఏసుబాబు సూచించారు. శానిటేషన్ సూపర్‌వైజర్ సోమేశ్వరరావు, ఏఎస్‌వో రజిని, శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు.

April 2, 2026 / 07:10 AM IST

డ్రైవర్ మృతి.. కుటుంబానికి 1.30కోట్ల అందజేత

TPT: మంగళం డిపోలో గతేడాది డిసెంబర్ 12 జరిగిన ప్రమాదంలో డ్రైవర్ వి. సుధాకర్ మరణించారు. దీంతో ఆయన నామినీ వి.వి. భారతికి రూ.1.10 కోట్లను SBI అధికారులు బుధవారం DPTO కార్యాలయంలో అందజేశారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ + రూ.20 లక్షలు (ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్) ఉంది. ఈ కార్యక్రమంలో ED(E) కిశోర్, DPTO జగదీశ్, RTC అధికారులు, SBI మేనేజర్‌లు పాల్గొన్నారు.

April 2, 2026 / 07:09 AM IST

నేడు గృహనిర్మాణ సమస్యలపై ఫోన్ ఇన్

KRNL: జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఫోన్ సేవను హౌసింగ్ పీడీ చిరంజీవి బుధవారం ప్రారంభించారు. ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 08518-257481 నంబర్‌కు కాల్ చేసి గృహ నిర్మాణ సామగ్రి, సిమెంట్, స్టీల్ సరఫరా, బిల్లుల సమస్యలను తెలియజేయాలని సూచించారు.

April 2, 2026 / 07:09 AM IST

ఈనెల 23 నుంచి 26 వరకు ఘనంగా జాతర

ASR: కొయ్యూరు మండలం నడింపాలెం, శరభన్నపాలెం గ్రామాల మధ్యలో వెలసిన ఎర్రకొండమ్మ జాతర మహోత్సవాలను ఈనెల 23 నుంచి 26 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గొడ్డేటి మహేశ్ తెలిపారు. బుధవారం అమ్మవారి ఆలయం వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. జాతరకు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు.

April 2, 2026 / 07:09 AM IST

‘సోలార్ విద్యుత్‌కు ముందుకు రావాలి’

AKP: సోలార్ విద్యుత్ ఏర్పాటుకు వినియోగదారులు ముందుకు రావాలని విద్యుత్ శాఖ ఏడీఏ సునీల్ విజ్ఞప్తి చేశారు. కోటవురట్ల మండలం బీకే పల్లిలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు అధ్యక్షతన సోలార్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే బిల్లులు గణనీయంగా తగ్గుతాయన్నారు.

April 2, 2026 / 07:09 AM IST

కన్నతల్లి చెంతకు విక్రయించిన పసికందు

కడప: చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పసికందును విక్రయించిన ఘటనలో పోలీసులు వెంటనే స్పందించి, చిన్నారిని సురక్షితంగా కాపాడారు. బాధితురాలు లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరులో గాలింపు చేపట్టిన పోలీసులు, ప్రభుత్వ ఆసుపత్రి స్వీపర్ సుబ్బమ్మ వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పసికందును తల్లికి అప్పగించారు.

April 2, 2026 / 07:08 AM IST

‘రీ సర్వే చేసే గ్రామాలలో తహసీల్దార్లు వెళ్లాలి’

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. రీ సర్వే గ్రామాలలో ప్రతిరోజు తహసీల్దార్లు వెళ్లాలన్నారు. రెవెన్యూ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ విషయాల్లో జిల్లా వెనుకబడి ఉందని, ఆ చెడ్డ పేరు పోగొట్టేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.

April 2, 2026 / 07:08 AM IST

‘వ్యాధి రావడానికి మూలాలు విశ్లేషించాలి’

:PPM: జిల్లాలో వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా వ్యాధులు ప్రబలితే కేవలం చికిత్స కాకుండా రావడానికి కారణాలను దాని మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టాలన్నారు.

April 2, 2026 / 07:07 AM IST

రూ.70 కోట్లతో కుప్పం బస్టాండ్ : మునిరత్నం

CTR: రూ.70 కోట్లతో కుప్పం RTC బస్టాండ్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. RTC బస్టాండ్ ప్రాంగణాన్ని ఆయన బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారని ఆరా తీశారు.

April 2, 2026 / 07:07 AM IST

విశాఖలో ‘మన శంకర వరప్రసాద్’ 50 డేస్ వేడుకలు

VSP: విశాఖలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ‘మన శంకర వరప్రసాద్’ సినిమా 50 డేస్ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. చిరంజీవి చిత్రాలు మంచి సందేశాలు ఇస్తాయని, అభిమానుల ఐక్యత అభినందనీయమని తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

April 2, 2026 / 07:07 AM IST

శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి తిరుణాలకు సర్వం సిద్ధం

NDL: జూపాడుబంగ్లా మండలం తత్తూరులో గల శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి తిరుణాళ్లకు సర్వం సిద్ధం చేశారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుంచి ప్రారంభమై ఈ నెల 4 వరకు వసంతోత్సవం తీర్థావళితో ముగియనున్నాయి. 2న స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరుపుకోవడం ఇక్కడ విశిష్టత. జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నలమూల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

April 2, 2026 / 07:06 AM IST

రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు

NLR: నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెళ్లడించారు.

April 2, 2026 / 07:04 AM IST

‘సురక్షితమైన తాగునీటిని అందించాలి’

VZM: గ్రామాల్లో, పాఠశాలల్లో, వసతి గృహాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షితమైన తాగు నీటిని అందించాలని కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్. డబ్ల్యూ.ఎస్, సంబంధిత అధికారులతో తాగునీరు, వేసవి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్. ఓ ప్లాంట్ లేని పాఠశాల, వసతి గృహాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

April 2, 2026 / 07:03 AM IST

అట్టహాసంగా కోదండ రాముని కళ్యాణం.!

కడప: ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. దాదాపు 80 వేలకు పైగా భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కోదండ రాముని ఆలయం కళ్యాణ వేదిక వద్ద వేలాది మంది భక్తులు కళ్యాణ వేడుకలో పాల్గొని కళ్యాణాన్ని ప్రత్యక్షంగా.. లక్షలాది మంది భక్తులు పరోక్షంగా వీక్షించారు.

April 2, 2026 / 07:03 AM IST

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ప్రకాశం: పుల్లలచెరువు మండలం మురికిమల్ల తండా వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడు మండలంలోని చెన్నంపల్లికి చెందిన చిన్న గురవయ్యగా పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా నుంచి ముక్కజొన్న కంకులుతో మల్లెపాలెం తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

April 2, 2026 / 07:03 AM IST