• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీని శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం గిరిశిఖర గ్రామమైన మంత్రజోల గ్రామస్తుల కలిసి తమ గ్రామానికి BT రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. డోలిమోత గ్రామంగా గుర్తించి ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసిందని, ఆయితే ఆటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో చివరి దశలో రోడ్డు పనులు ఆగిపోయాయని వాపోయారు.

March 1, 2026 / 06:28 AM IST

ఘనంగా పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ

కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది వీడ్కోలు సభ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటివరకు వీరంతా విధి నిర్వహణలో నిరంతరాయంగా మీతో గడిపే సమయం కూడా లేకుండా విధుల్లో నిమగ్నం అయ్యారని, విరమణ అనంతరం వారికి ప్రశాంత జీవితం అందజేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని తెలిపారు.

March 1, 2026 / 06:26 AM IST

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: తెనాలి పినపాడు గేటు సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి (55) మృతి చెందాడు. హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు దాటుతున్న సమయంలో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి జీఆర్‌పీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 06:26 AM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

నంద్యాల: TDP కార్యాలయంలో మంత్రి ఫారూఖ్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ప్రభుత్వం దృష్టికి వెళ్లవలసిన సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 06:24 AM IST

దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించిన పోలీసులు

BPT: వెదుళ్లపల్లిలో జరిగిన ఇనుప గేట్ల చోరీ కేసును ఎస్సై భాగ్యరాజు ఛేదించారు. ఫిబ్రవరి 12న వెంకటేశ్వరరెడ్డి ఇంటి వద్ద చోరీకి గురైన రెండు గేట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం గుర్తించారు. ఈ చోరీకి పాల్పడిన A1 సంగీత రంజిత్ కుమార్, A2 ఆసోడి సాయిబాబులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

March 1, 2026 / 06:23 AM IST

పెసలు- మినుము కొనుగోలుకు అనుమతి: జేసీ

ELR: పెసలు క్వింటా రూ.8,768, మినుములు రూ.7,800 కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ శనివారం తెలిపారు. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాల్లో ఈ-పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకు సమీపంలోని RS కేంద్రాల్లో ఇప్పటి నుంచి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 06:19 AM IST

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

విశాఖ: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీల్లో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, సినీ స్టార్స్ పాల్గొన్న పోటీల్లో ఎమ్మెల్యే ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయన్నారు.

March 1, 2026 / 06:17 AM IST

945 గ్రాముల గంజాయి స్వాధీనం

TPT: గాజుల మండ్యం ఇండస్ట్రియల్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లడుతూ.. బీహార్‌కు చెందిన గజేంద్ర రాయ్ వద్ద నుంచి 945 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో కొనుగోలు చేసి అత్తూరు పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని రిమాండ్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 06:14 AM IST

‘డయేరియాపై ఆందోళన చెందవద్దు’

SKLM: డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె. పద్మావతి అన్నారు. శనివారం సాయంత్రం డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అతిసారం తగ్గుముఖం పట్టిందని, ప్రతీ ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

March 1, 2026 / 06:13 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

BPT: చెరుకుపల్లి మండలం నడింపల్లిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. జాతీయ రహదారి (NH-216) దాటుతున్న దాసరి ప్రసాద్‌ను, చెరుకుపల్లి వైపు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్‌కి కాళ్లు విరిగి తీవ్ర గాయాలవ్వగా, బైక్ నడుపుతున్న శివన్నారాయణకు కూడా గాయాలయ్యాయి. వీరిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

March 1, 2026 / 06:13 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నలుగురి అరెస్టు

GNTR: పెదకాకాని మండలం స్వర్ణపురి కాలనీలో శనివారం సాయంత్రం పోలీసులు జూద స్థావరంపై దాడి చేశారు. ఎస్పీ, సీఐ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి కాళీ గార్డెన్స్ సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,990 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

March 1, 2026 / 06:12 AM IST

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కావాలి: కలెక్టర్

కర్నూలు: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు వివరించారు.

March 1, 2026 / 06:11 AM IST

జనసేన సభ్యత్వ నమోదును పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడూరు జనసేన కార్యాలయాన్ని సందర్శించారు. శనివారం సాయంత్రం కోడూరు మండల పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సమావేశమయ్యారు. ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియను సమీక్షించారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, టౌన్ అధ్యక్షులు కోట రాంబాబు, జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:10 AM IST

కదిరిలో స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, కలెక్టర్, అధికారులకు కందికుంట వెంకటప్రసాద్ దంపతులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.

March 1, 2026 / 06:02 AM IST

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

E.G: రాజమండ్రిలో శనివారం జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి. 41వ వార్డుకు చెందిన మండవిల్లి నాగ వెంకట సత్యమురళీకృష్ణ (నానాజీ) తన అనుచరులు 50 మందితో కలిసి పార్టీలో చేరారు. సిటీ జనసేన ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరికి గంట స్వరూప దేవి, తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.

March 1, 2026 / 06:00 AM IST