• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య సంఘం సభ్యుడు శ్రీనివాసులు కుమారుని వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 27, 2026 / 10:15 AM IST

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్

CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 27, 2026 / 10:15 AM IST

‘సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి’

CTR: సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 27, 2026 / 10:15 AM IST

హత్య చేసింది విద్యార్థులే

అన్నమయ్య: గాలివీడులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలు అన్నదమ్ముల మధ్య వర్గ పోరే ఈ హత్యకు కారణమని DSP కృష్ణమోహన్ తెలిపారు. ఈ హత్యలో కనిగిరి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి పెద్దారెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. పొద్దుటూరుకు చెందిన కులాయప్ప, కనిగిరికి చెందిన తిరుపతి రెడ్డి, విశ్వనాథరెడ్డి, మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

February 27, 2026 / 10:14 AM IST

చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: కొల్లిపర మండలం అత్తోట సమీపంలోని కుంచవరం అడ్డరోడ్డు వద్ద గల పంట పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మృతదేహం కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు.

February 27, 2026 / 10:14 AM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీఐ

SKLM: ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న తీరును సీఐ ఎం శ్రీనివాసరావు పరిశీలించారు. శుక్రవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని నిబంధనలను మితిమీరితే కేసులు పెట్టడం తప్పదని హెచ్చరించారు.

February 27, 2026 / 10:14 AM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే అమిలినేని

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన అమ్మవారి చల్లని చూపుతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు.

February 27, 2026 / 10:10 AM IST

ఇంటర్ విద్యార్థి డీబార్

CTR: గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. ఈక్రమంలో ఆర్జేడీ సురేష్ బాబు జిల్లాలో తనిఖీలు చేశారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి చూసిరాతకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థిని డీబార్ చేశామని డీఐఈవో రఘుపతి తెలిపారు.

February 27, 2026 / 10:07 AM IST

జిల్లా అభివృద్ధి, ఎన్నికల సన్నాహాలపై సీఎం సమీక్ష

KRNL: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి డా. రామనాయుడు, మంత్రి టి.జి. భరత్, MP నాగరాజు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జ్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు.

February 27, 2026 / 10:05 AM IST

నాటికల పోటీల్లో విద్యార్థుల సత్తా

BPT: కర్లపాలెం పరిధిలోని ఎంవీరాజుపాలెం ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి నాటికల పోటీల్లో వీరు అదరగొట్టారు. హిందీ, తెలుగు నాటికల్లో ప్రథమ స్థానం సాధించారు. ఇంగ్లిష్ నాటికలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. హెచ్‌ఎంలు విజయభాస్కరరెడ్డి, సౌజన్యలు విజేతలకు బహుమతులు అందజేశారు.

February 27, 2026 / 10:04 AM IST

సురక్షితమైన తాగునీరు సరఫరా చేయాలి: మార్కాపురం కమిషనర్

ప్రకాశం: నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షితమైన తాగునీటి సరఫరా, పైపులైన్ లీకేజీలను అరికట్టాలని కమిషనర్ నారాయణ రావు అన్నారు. మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో అసిస్టెంట్ ఇంజినీర్లు, సచివాలయ వార్డు ఆమినిటీ సెక్రటరీలు, పవర్ బోర్ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాలో ఏవైన సమస్యలుంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

February 27, 2026 / 10:01 AM IST

‘వంతెనల నిర్మాణంపై ప్రతిపాదనలను వెంటనే అందజేయాలిస’

GNTR: బందరు ఓడరేవుకు అనుసంధానంగా రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంపై రెవెన్యూ, రైల్వే, రహదారులు–భవనాలు తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ అంచనాలు, విద్యుత్ సరఫరా ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.

February 27, 2026 / 10:01 AM IST

‘ఇందన సంస్థల పర్మిట్లు రద్దు చేయాలి’

కోనసీమ: యానాం ఇంధన అక్రమాలపై ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు గురువారం ధ్వజమెత్తారు. 20 వేల జనాభా ఉన్న యానాంలో రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఈ అక్రమ రవాణా వల్ల కోనసీమ బంకు యజమానులు నష్టపోతున్నారని, సంబంధిత సంస్థల పర్మిట్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు

February 27, 2026 / 10:00 AM IST

సోమందేపల్లిలో ఉరేసుకుని వ్యక్తి మృతి

సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీలో నివసిస్తున్న వడ్డే మారుతి (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణలో ఎదురైన సమస్యలు, అప్పుల భారం కారణంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 10:00 AM IST

బీజేపీ నేత శివప్రసాద్‌కు ‘సంత్ గాడ్గే బాబా’ అవార్డు

E.G: గోకవరం మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కరాసు శివప్రసాద్ గురువారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా సంత్ గాడ్గే బాబా అవార్డు అందుకున్నారు. రజక జాతి అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. సంత్ గాడ్గే బాబా ఆశయాలను సమాజానికి విస్తృతంగా తీసుకెళ్తున్నామని బీజేపీ నేత ఉంగరాల ఆది విష్ణు తెలిపారు.

February 27, 2026 / 10:00 AM IST