• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు లేపాక్షి ఆలయ ద్వారాలు మూసివేత

SS: మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో నరసింహమూర్తి తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు నిత్యపూజలు ముగించి, 8:30 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి, అభిషేకాలు నిర్వహించి, 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

March 2, 2026 / 07:09 AM IST

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల

CTR: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను టీస్ ఆధారంగా సిద్ధం చేసి డీఈవో, డీవైఈవో, ఎంఈవోల మెయిల్స్‌కు పంపినట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోగా తగిన ఆధారాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సంబంధిత డీఈవో, మండల విద్యాశాఖాధికారుల ధృవీకరణతో అభ్యంతరాలు ఇవ్వాలని తెలిపారు.

March 2, 2026 / 07:08 AM IST

ఈనెల 5న అనంతపురంలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు

ATP: జిల్లా ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న RDT స్టేడియంలో జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి శివకుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలలో అండర్-10, 13, 15 విభాగాల్లో రికర్వ్, ఇండియన్, కాంపౌండ్ అంశాలు ఉంటాయి. ఇందులో ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈనెల 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

March 2, 2026 / 07:08 AM IST

బాణా సంచా దుకాణాల్లో సీఐ తనిఖీలు

ELR: నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నిడమర్రు సీఐ నక్కా రజనీకుమార్ హెచ్చరించారు. ఆదివారం పిప్పరలోని గోడౌన్లను పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బందితో కలిసి ఆయన తనిఖీ చేశారు. అగ్నిమాపక జాగ్రత్తలు పాటించాలని, అనుమతులు లేకుండా అమ్మకాలు జరపరాదని సూచించారు. రాబోయే జాతరల్లోనూ నిబంధనల మేరకే బాణాసంచా వినియోగించాలని సీఐ సూచించారు.

March 2, 2026 / 07:07 AM IST

బాణసంచా తయారీ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు

E.G: బిక్కవోలు మండలంలోని బాణసంచా తయారీ కేంద్రాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP విద్య, DTC ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆదివారం తనిఖీ చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖలతో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో నిబంధనలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి అమ్మకాలు, తయారీ చేపట్టకూడదని యజమానులకు నోటీసులు జారీ చేశారు.

March 2, 2026 / 07:05 AM IST

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఎస్పీ ప్రెస్ మీట్

NLR: ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని తెలిపారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆందోళన చందవద్దు అని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

March 2, 2026 / 07:02 AM IST

కొల్లూరులో కార్డన్ సెర్చ్ నిర్వహణ

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, ఆదివారం కొల్లూరులో పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 130 మంది సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.

March 2, 2026 / 06:58 AM IST

హనుమాపురంలో వాహనాల తనిఖీ.. 17 మందికి జరిమానా!

KRNL: పెద్దకడబూరు మం. హనుమాపురం వద్ద ఆదివారం ఎస్సై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది వాహనదారులకు రూ. 3,995 జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడంపై SI ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 06:56 AM IST

రెడ్డిపాలెంలో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

BPT: చందోలు ఎస్సై శివకుమార్ నేతృత్వంలో పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని, కార్లలో అనుమతి లేని వస్తువులను రవాణా చేయరాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

March 2, 2026 / 06:55 AM IST

నేటి మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేస్తారు. 10:30 గంటలకు రామచంద్రపురంలో రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

March 2, 2026 / 06:55 AM IST

మహిళలకు ఉచిత మాస్టర్ టైలర్ శిక్షణ

అన్నమయ్య: రైల్వే కోడూరులో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్, నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో టూల్ కిట్, ఇండస్ట్రియల్ కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వబడతాయని ట్రస్ట్ ఛైర్మన్ పార్థసారథి తెలిపారు. ఆసక్తి గల మహిళలు మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలలోపు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

March 2, 2026 / 06:54 AM IST

చల్లపల్లిలో రోశయ్య విగ్రహావిష్కరణ

కృష్ణా: కొణిజేటి రోశయ్య జీవితం ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఆదివారం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.

March 2, 2026 / 06:51 AM IST

ఎమ్మెల్యే రవికుమార్ నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆదునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు పొందూరు MPDO కార్యాలయం వద్ద గ్రామ పంచాయితీలకు “ట్రై సైకిల్స్” పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

March 2, 2026 / 06:48 AM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది’

W.G: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పారు.

March 2, 2026 / 06:43 AM IST

పెనుమూరులో 5న మెగా ఉద్యోగ మేళా

CTR: పెనుమూరులోని స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సురేంద్రరెడ్డి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, బీఫామ్ పూర్తి చేసి 18-35 ఏళ్లలోపు ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

March 2, 2026 / 06:40 AM IST