కోనసీమ: అమలాపురంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్‌లో పార్లమెంట్ స్థాయి క్రియాశీలక జనసేన సభ్యత్వం(ఉద్యమి) నమోదు అవగాహనా సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ మెంబర్షిప్ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ విచ్చేసి క్యాడర్ సాధక్‌లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించారు.
AKP: సైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. సైన్స్ డే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు హైస్కూల్ ఇంఛార్జ్ హెచ్ఎం విజయలక్ష్మి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు అందరూ సైన్స్ డేలో పాల్గొనాలన్నారు.
ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరూ గుంపులుగా ఉండకూడదని పోలీసులు శుక్రవారం స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించి, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా భద్రత చర్యలు పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు.
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఆమదాలవలస పట్టణ అధ్యక్షుడు సంపతి రావు మురళి అన్నారు. స్థానిక TDP కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పలు సమస్యలపై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు.వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ తులసీదళార్చన శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వర్ణ తులసీదళార్చన అత్యంత వైభవంగా దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సత్యసాయి: నేతన్నల అభ్యున్నతికి, చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. శుక్రవారం బడ్జెట్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు. కొద్ది కాలంలోనే రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. రాబోయే ఉగాది పండుగకు మరో విడత బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
E.G: గోపాలపురం నియోజకవర్గంలో 85 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. 27వ విడతగా మంజూరైన ఈ చెక్కులు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ATP: అనంత నాగ్ సంగీత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్కేపి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాలు శత గళార్జన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత కళాపరిషత్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ హాజరవుతారన్నారు.
GNTR: చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని చేనేత కార్మిక సంఘం నాయకుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చేనేత పరిరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
SKLM: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందన్నారు.
తిరుపతి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొత్త సీఐ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మద్దయ్యచారి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్తూరులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరణ చేయాలని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై నమోదైన కేసులను మానవతా దృష్టితో ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.