ELR: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో భీమడోలు మండలానికి సంబంధించి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భీమడోలు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో కొత్తగా ప్రవేశం కోసం 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
ప్రకాశం: గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మనం దెబ్బతిన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురంలో ఇవాళ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దర్శి, ఎర్రగొండపాలెంలో ఓడిపోయామని, వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పాను, చేసి చూపించానని చెప్పుకొచ్చారు.
NDL: బనగానపల్లె(మం) గులాంనబిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. బైకులో అతివేగంగా వెళుతూ.. ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో బైకులో ప్రయాణిస్తున్న యువకుడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
CTR: మార్చి 2న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని AP అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పుంగునూరులో ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి(మం) అప్పకొండయ్య గారిపల్లిలో ఉపాధి హామీ పనులు, దీన్నేపాడు గ్రామంలోని కోమటివాని వంక వాటర్‌షెడ్, రామరాజు వంక వాటర్‌షెడ్, కోనంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మామిడి తోట, దొర్రి చెరువు, లక్కిరెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్, సీసీ రోడ్ల పనులు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
KDP: ఏసీబీ అధికారుల దాడులలో పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణపై మరో కేసు నమోదైంది. ఏసీబీ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రూరల్ సీఐ ఇంటిలో సోదాలు నిర్వహించి 59 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లను పులివెందుల ఎక్సైజ్ కార్యాలయానికి అప్పగించగా, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి బుధవారం తెలిపారు.
NTR: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
KRNL: కౌతాళం(మం) అగసులదిన్నె గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఇవాళ వాల్మీకి బీ.లక్ష్మన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా లక్ష్మన్న పార్టీ కండువాలు వేసి సభ్యులను ఆహ్వానించారు. DY.CM పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ఇమ్రాన్ బుధవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, హాజరు నమోదు, శుభ్రత సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఎంపీడీవో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.
GNTR: పిల్లలే రాష్ట్ర భవిత… రేపటి చరిత్ర సృష్టించేది నేటి విద్యార్థులే” అని విద్యా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమ్మలాంటి మాతృభాష తెలుగును ఎప్పటికీ మరవొద్దని సూచించారు. అసెంబ్లీని సందర్శించేందుకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి స్నేహపూర్వకంగా ముచ్చటించారు.
E.G: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చూస్తుందని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు బద్రం దొర విమర్శించారు. బుధవారం నిడదవోలు మండలం కలవచర్లలో ఉపాధి హామీ కూలీలకు పథకం గురించి వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో 247 పనులు ప్రారంభించామని, వాటిలో ఇప్పటికే 187 పనులు పూర్తి చేశామని టీడీపీ నేత గిరిధర్ రెడ్డి బుధవారం వెల్లడించారు. 23వ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8.30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానికులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నముక్కపల్లె వద్ద కారు ఢీకొని మృతి చెందిన దుప్పిని డీఎఫ్‌వో ఆదేశాల మేరకు ఎల్బీవో శాంతి మంగళవారం ఖననం చేశారు. పశువైద్య అధికారి ఎం.లక్షుమయ్య మరణించిన దుప్పికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖననం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్వాచర్ నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
TPT: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను కొనుగోలు చేయడానికి భక్తులు https://konugolu .ap.gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు టీటీడీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.