E.G: బిక్కవోలు మండలంలోని బాణసంచా తయారీ కేంద్రాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP విద్య, DTC ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆదివారం తనిఖీ చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖలతో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో నిబంధనలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి అమ్మకాలు, తయారీ చేపట్టకూడదని యజమానులకు నోటీసులు జారీ చేశారు.