NLR: ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని తెలిపారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆందోళన చందవద్దు అని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.