VZM: గజపతినగరం మండలం మర్రివలస ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ప్రారంభించిన ‘నేను చేసిన మంచిపని’ కార్యక్రమం ఫలితాన్ని ఇస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకల చంద్రరావు సోమవారం తెలిపారు. పాఠశాల విద్యార్థులు తాడి పూజ ముగడ గాయత్రీలకు రూ. 1100లు దొరకగా తమకు దొరికిన డబ్బులను పెద్దల దృష్టిలో పెట్టి పోగొట్టుకున్న వారికి అందజేశారని తెలిపారు.
విశాఖ ఎంజీఎం పార్కు బీచ్ వద్ద సముద్రం ఒడ్డుకు యువతి మృతదేహం కొట్టుకురావడంతో కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు.. 112 ద్వారా చేరుకున్న త్రీటౌన్ పోలీసులు మృతురాలిని పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీకి చెందిన వంగిపురం వైష్ణవిగా గుర్తించారు. ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ ఆర్ఎస్‌యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కంటేపల్లి నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. 77 జీవో రద్దుచేసి ఫీజు రీయంబర్స్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
అన్నమయ్య: సుండుపల్లె మండలంలో కురిసిన గాలి వానతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వైన్‌పాలెం పంచాయతీ బాఘంపల్లె రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిమ్మసముద్రం పంచాయతీలో చెట్టు కొమ్మలు విరిగి పడడంతో రహీం అనే వ్యక్తి గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నం నుంచి ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీగా బయల్దేరారు. జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి వాహనాల్లో మూలపేటకు ప్రయాణమయ్యారు. ఈ ర్యాలీలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
E.G: పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పాల్గొన్న పశువైద్య నిపుణులు పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. పెద్ద సంఖ్యలో రైతులు ఈ శిబిరాన్ని వినియోగించుకొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు.
PPM: దూలికుప్ప గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఉదయపురం పంచాయతీలో మొత్తం 99 ఇళ్లకు మంజూరు కాగా, దూలికుప్ప గ్రామానికి 28 ఇళ్లు కేటాయించారు. వాటిలో 26 ఇళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
PLD: నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు కమిటీ తీపి కబురు అందించింది. ఈ నెల 31తో నీటి విడుదల నిలిపివేయాలన్న ముందస్తు నిర్ణయాన్ని మార్చుకుని, ఏప్రిల్ 10 వరకు సరఫరా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కాలువకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేవలం సాగు అవసరాలున్న ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో హర్షాలు వ్యక్తమవుతున్నాయి.
SKLM: జి. సిగడాం మండలం దేవరవివలస గ్రామంలో మడ్డువలస ఫేజ్–2 ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే ఈశ్వరరావు సోమవారం ప్రారంభించారు. రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేలా ఈ పనులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. 547 సర్వే నంబరులో అర్హులైన మాదిగలకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని నాయకుడు అంజన్న ప్రసాద్ డిమాండ్ చేశారు. పేదలకు గృహవసతి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు.
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్లలో నూతన గృహాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం నుంచి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం హయాంలో గృహ నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు.
విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా హోంమంత్రి అనిత స్థానిక సబ్ జైలు, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
W.G: ఆకివీడు పెద్దపేట వివాదానికి శాంతియుత పరిష్కారం లభించేలా అధికారులు జోక్యం చేసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ కోరారు. ఈ వివాదం ప్రజల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి అరెస్టులు, నిర్బంధాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
CTR: నగరి మున్సిపాలిటీ ఓరుగంటాపురంలో జరిగిన గృహప్రవేశం కార్యక్రమంలో సోమవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే భాను ప్రకాష్ తాళం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మొదటి విడత కింద 2025 నవంబర్‌లో 3,00,192 ఇళ్లను పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం, రెండో విడతగా మరో 2,50,893 ఇళ్లను పంపిణీ చేస్తుందని తెలిపారు.
SKLM: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. నరసన్నపేట మండలంలోని దేవాది-మబగాం రోడ్డు నుంచి కిళ్లాం వరకు రూ.కోటితో నిర్మించిన సిమెంట్ రోడ్డును సోమవారం ప్రారంభించారు. కూటమి పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త అర్చన, తదితరులు పాల్గొన్నారు.