ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నలుగురు దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. ఎంపీ నిధుల నుంచి మంజూరైన ఈ వాహనాల తాళాలను లబ్ధిదారులు షేక్ నబీ సాబ్, హరినాథ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనాథ్ రెడ్డికి శుక్రవారం అందజేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి వాహనాలు అందించినందుకు లబ్ధిదారులు ఎంపీకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
TPT: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులకు జాగ్రత్తలు వివరించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండలో టోపీ, గొడుగు వినియోగం, తరచూ నీరు తాగడం వంటి సూచనలు ఇచ్చారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని అధికారులు తెలిపారు.

VZM: కొత్తవలస విజయనగరం ప్రధాన రహదారి బెల్లాల డాక్టర్ హాస్పిటల్ నుంచి అన్న క్యాంటీన్ వచ్చే మురుగుకాలువ ఇవాళ కురిసిన వర్షానికి కాలువలో పేరుకుపోయిన చెత్త రోడ్డు మీదకు కొట్టుకువచ్చింది. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రోడ్డుమీద ప్రవహించడంతో దుకాణంలో ఉన్న సరుకులు జలపాతం అవుతున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
PLD: నరసరావుపేటలోని డీపీటీవో కార్యాలయాన్ని జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖ పనితీరు, రవాణా సేవలు, పరిపాలనా అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డీపీటీవో పల్నాడు టీ. అజితా కుమారి, అకౌంట్స్ ఆఫీసర్, డిపో మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే రౌడీ షీటర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. మన్నూరు పోలీస్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో నేరప్రవృత్తిని విడిచి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.
W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.
ప్రకాశం: దర్శి మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
CTR: చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలో “స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే–2026” ఉత్సాహంగా జరిగింది. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ పోటీల్లో...
KRNL: ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలను ఆ పార్టీ తుగ్గలి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చెక్క శీను శుక్రవారం హైదరాబాదులో కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేశారు. మండలంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శ్యామల ఆరా తీశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు శీను తెలిపారు.
TPT: తిరుపతి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 26 మందిపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 47 మందిపై కేసులు నమోదు చేసి రూ.23,500 జరిమానా వసూలు చేశారు. పోలీసులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రజలకు సూచించారు.