VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం సీఐ శంకర్రావు ,ఎస్సై దామోదర్ రావు నాగబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు లేని వెహికల్స్‌ను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే, మద్యం సేవించి వాహనం నడపరాదని అన్నారు.
అనంతపురంలో కూటమి నేతల అవినీతిపై విచారణకు సిద్ధమా అని మేయర్ మహమ్మద్ వసీం సవాల్ విసిరారు. గురువారం కార్పొరేటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, అదనపు ట్రాక్టర్లు ఉన్నా చెత్త సేకరణ జరగడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అన్నమయ్య: మదనపల్లె మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె నుంచి తిరుపతి వైపు వెళుతుండగా సీటీఎం రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళంలో డయేరియా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పారిశుధ్య పనుల్లో ఎక్కడా అలసత్వం వహించకూడదని జేసీ, నగరపాలక సంస్థ ఇంఛార్జ్ కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించారు.
ELR: ముదినేపల్లి మండలం పెదకామనపూడికి చెందిన దొండపాటి వరప్రసాద్(22) గురువారం మృతి చెందాడు. చెరువు గట్ల కోసం మట్టి తోలుతుండగా ట్రాక్టర్ దిగబడి ఉన్న దాన్ని మరో ట్రాక్టర్‌తో బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు వాటి మధ్య ఇరుక్కుపోయి యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
AKP: పునర్వనంపై వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలమంచిలిలో రోడ్డు విస్తరణలో తొలగించిన వృక్షాలను పునర్వనం కార్యక్రమంలో మరో చోట నాటినట్లు పవన్ కళ్యాణ్‌కు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ వివరించారు. ఇది మంచి కార్యక్రమమని చెట్లు తొలగించవలసి వస్తే ఇదేవిధంగా నాటే విధంగా ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు.
తిరుపతి జిల్లాలో 11-03-2026 నుంచి 16-03-2026 వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల శిబిరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ALIMCO సహకారంతో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
అన్నమయ్య: పరిశ్రమల పేరుతో దళితుల భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేదల భూముల జోలికి వస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. గ్రామసభ తీర్మానం లేకుండా భూసేకరణ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
PPM: కురుపాం మండలం రస్తాకుంటుబాయిలో కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. 2025-26లో చేపట్టిన కార్యక్రమాల సమీక్షతో పాటు 2026-27 కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశానికి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధనా సంచాలకులు డా. ఏ.అప్పలస్వామి అధ్యక్షత వహించగా, డా.బి.ముకుందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీకు ఉన్న ఫాలోయింగ్ ఒక బాధ్యత అని, దానిని ప్రజల భద్రత, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే మీరు నిజమైన “డిజిటల్ వారియర్స్” అవుతారన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు, బాలికల భద్రత, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
కృష్ణా: గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌతవరం గ్రామంలో రోడ్డు భద్రత, మహిళల భద్రత, పోక్సో కేసులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌వివి సత్యనారాయణ నిర్వహించారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
E.G: అమరావతిలో బీ.సీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి ఎస్.సవితను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. వీలైనంత త్వరగా చేనేతలకు రావలసిన బకాయిలను అందించి, వారిని ఆదుకోవాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.
నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వార్షిక క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ, జట్టు భావన, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సుజాత తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా ఆనందభరిత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు.
కడప: నగర 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మ ఇటీవల వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సహకరించాలని సీఎం సూచించారు.
కర్నూలు : కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నలుగురు ఉద్యోగులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి వెల్లడించారు.