• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తల్లీకూతుళ్ల గొడవ..యువతి ఆత్మహత్య

అనంతపురంలో తల్లీకూతుళ్ల మధ్య జరిగిన గొడవలో యువతి మృతి చెందింది. ఉరవకొండ మండలం మైలారంపల్లికి చెందిన హారతి(21) ప్రేమ వ్యవహారంపై తల్లి జయలక్ష్మితో వివాదం జరిగింది. బుధవారం రాత్రి ఇద్దరూ పురుగు మందు తాగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హారతి గురువారం మృతి చెందింది. జయలక్ష్మికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 6, 2026 / 08:18 AM IST

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: రామసముద్రం మండలం వనగానపల్లిలో ఎస్.రాహుల్ (16) పదో తరగతి విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 6, 2026 / 08:16 AM IST

ఇంటి పట్టాలు ఇవ్వాలి: ఎమ్మెల్యే

KRNL: ఆదోని నియోజకవర్గం బసాపురం గ్రామంలో మేక వంకపై వంతెన నిర్మించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదనంగా సర్వే నంబర్లు 20, 21, 64, 47 లో నివాసం కలిగిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఉపసభాపతి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 6, 2026 / 08:16 AM IST

నేడు మున్సిపాలిటీలో బహిరంగ వేలం..!

WG: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి గురువారం తెలిపారు. ఈ వేలం ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. సదరు పాటదారులు అందరూ బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.

March 6, 2026 / 08:13 AM IST

MLA చొరవతో రహదారి నిర్మాణం పూర్తి

SKLM: ఎచ్చెర్ల మండలం ఎం.కొత్తపేట–తోటపాలెం రహదారి పనులు గురువారం పూర్తవడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ప్రజలు MLA కు కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 08:12 AM IST

నేడు రంగనాథస్వామి తెప్ప ట్రయల్ రన్

నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా, తెప్ప పనితీరును పరిశీలించడం కోసం ఉదయం 10:30 గంటలకు పెన్నానది తీరంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద తెప్ప ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

March 6, 2026 / 08:00 AM IST

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. ఎప్పుడంటే?

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 6, 2026 / 08:00 AM IST

‘జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి’

KKD: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి సభ్యత్వ నమోదు ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, ‘సాధక్’లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై జనసేన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

March 6, 2026 / 08:00 AM IST

40 ఏళ్ల తర్వాత విశాఖ ‘జూకు’ బ్లాక్ పాంథర్

విశాఖ జుపార్కుకి అరుదైన బ్లాక్ పాంథర్ వచ్చి చేరింది. అస్సాం స్టేట్ జూ పార్కుతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా పలు జంతువులను ఇక్కడకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆడ బ్లాక్ పాంథర్‌ను తీసుకురావడం విశేషం. అస్సాం నుంచి వచ్చిన అడవి మగ చిరుత, జంతువుల జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.

March 6, 2026 / 07:55 AM IST

‘స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. మునగపాక క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ పాల్గొన్నారు.

March 6, 2026 / 07:52 AM IST

స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతి

TPT: తిరుపతిలో రేణిగుంట రోడ్డులోని జూడియో షోరూమ్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను స్కూల్ బస్సు ఢీకొనడంతో గురువారం సాయంత్రం మృతి చెందింది. స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె వద్ద ఏలాంటి ఫోటో గుర్తింపు ఆధారాలు లేవని అలిపిరి పోలీసులు తెలిపారు.

March 6, 2026 / 07:46 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం..!

W.G: అసంపూర్తిగా ఉన్న రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ డిమాండ్ చేశారు. గురువారం శాసన మండలిలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి 2020 మే నెల 30న ప్రారంభించి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు.

March 6, 2026 / 07:45 AM IST

రాయచోటిలో ఘనంగా ఇఫ్తార్ విందు

అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్ నూర్ మసీదు వద్ద యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, సహృద్భావాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 6, 2026 / 07:45 AM IST

డ్రైవర్లకు నిద్రమత్తు వదలగొడుతున్న పోలీసులు

కోనసీమ: అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా స్పందించింది. అమలాపురంలో గురువారం రాత్రి నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

March 6, 2026 / 07:42 AM IST

‘విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం’

VZM: గరివిడి మండలం దుమ్మెద గ్రామంలో కోనూరు స్కూల్ ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం.. విద్యార్థులను చేర్పిద్దాం అంటూ తల్లిదండ్రులకు అవగాహనపరిచారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు తల్లిదండ్రుల భారం తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంపడాపు రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:42 AM IST