PPM: గిరిజన పీజీఆర్ఎస్‌తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్‌లో గిరిజనుల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ.. మహిళల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ప్రారంభించడానికి ఇక్కడ కలిసి ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: బాపులపాడులో ప్రధాన డ్రైనేజీలు పూడికతో నిండిపోవడంతో మురుగు ప్రవహించకుండా దుర్గంధం వ్యాపిస్తోంది. విజయవాడ, నూజివీడు రోడ్లలో డ్రైన్లు చెత్తతో నిండిపోయి కనిపిస్తున్నాయి. విజయవాడ రోడ్డులో గత వర్షాకాలంలో ఒకవైపు మాత్రమే పూడిక తొలగించగా, మరోవైపు నీరు నిలిచిపోయింది. దీంతో సైడ్ డ్రైన్లు కూడా ఎగదన్నుతూ మురుగు నిల్వై దోమలకు కేంద్రంగా మారాయి.
SKLM: మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఓపెన్ హౌస్‌లో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ZPHSలో శుక్రవారం మహిళా సాధికారకతపై ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై బి నిహార్ విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మార్పు అనేది ఇల్లు, పాఠశాల నుంచే మొదలవ్వాలని తెలిపారు. విద్యార్థులు బాధ్యతగా చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలన్నారు.
GNTR: రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యను ప్రాణాంతక విపత్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆమె లేవనెత్తారు.
కడప: జిల్లాలో భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన-2027 ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్రీధర్ జ్యోతి ప్రజ్వలనతో సెన్సస్ అధికారులకు తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 1 నుంచి 30 వరకు హౌస్ లిస్టింగ్, డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రకాశం: మార్కాపురం నుంచి వస్తున్న కారు పొదలి నుంచి వెళ్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడే అటుగా వెళుతున్న దొనకొండ ఎస్సై త్యాగరాజు ఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. అనంతరం పొదిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్యసాయి: హిందూపురంలోని ఆటో నగర్‌లో నూతన రోడ్లు, కాలువల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, బాలాజీ పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ పనులను రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: రంజాన్ మాసం మూడవ జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మసీదు ఇమామ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మికతపై ప్రసంగించారు. ఈ పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కారాలకు అధిక పుణ్యం లభిస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తిచేసి దువా చేశారు.
NTR: తిరువూరు MLA కొలికిపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీలో రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఇటీవల జరిగిన పరిణామాలు, MP చిన్నీతో వివాదంపై వివరణ ఇచ్చుకున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించిన పరిణామాలపై చింతిస్తున్నానని తెలిపారు. ఇకపై ఏ సమస్య వచ్చినా జోనల్ కోఆర్డినేటర్, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని హోల్ సేల్ బాణాసంచా దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. నిల్వ కేంద్రం వద్ద పని చేసే స్థితిలో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగూషర్లు ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వ ఉండాలని ఆదేశించారు. పరిమితికి మించి బాణా సంచాను నిల్వ చేయవద్దన్నారు.
AKP: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. 6,575 మంది హాజరు కావలసి ఉండగా 6,367 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, సౌకర్యాలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మకమైన రీసెర్చ్, అకాడమిక్ సంస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
కృష్ణా: ఘంటసాల గ్రామంలో పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన “ఐ లవ్ ఘంటసాల” సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆకర్షణీయ నిర్మాణం స్థానికులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: నరసన్నపేట మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. 10 పరీక్షలకు సంబంధించి 1268 మంది విద్యార్థులు రాస్తుండగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేమన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు కొనసాగుతాయి అన్నారు.