• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏనుగుల నియంత్రణకు ‘ఆపరేషన్ గజ’

CTR: గుడిపాల(M) చిత్తపారలో విధ్వంసం సృష్టిస్తున్న అడవి ఏనుగుల నియంత్రణకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. రామకుప్పం(M) ననియాల ఎలిఫెంట్ క్యాంపులోని శిక్షణ పొందిన ఏనుగు జయంత్ (55) సారథ్యంలో పలమనేరు ముసలిమడుగులో కర్ణాటక నుంచి వచ్చిన దేవా, అభిమన్యు, కృష్ణ ఏనుగులు ఆపరేషన్ గజలో పాల్గొననున్నాయి.

February 27, 2026 / 03:33 PM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో 50 చిని చెట్లు దగ్ధం

అనంతపురం: గుంతకల్లు మండలం నాగసముద్రం విద్యుత్ డీపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుర్రాబ్బడు టర్నింగ్ సమీపంలోని రైతు నాగేంద్ర (సర్వే నెం: 449-A)కు చెందిన రెండు ఎకరాల చిని తోటలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 50 చెట్లు కాలిపోగా, రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.

February 27, 2026 / 03:33 PM IST

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ..!

NDL: బనగానపల్లె మండలం గోవింద్ దీన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఇవాళ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. బ్రహ్మానంద ఆచారి పాఠశాలలోని విద్యార్థులకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఆయన అన్నారు. చెట్లపై ఆయన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

February 27, 2026 / 03:33 PM IST

‘బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలి’

AKP: పరవాడ, లంకెలపాలెం మీదుగా బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ జంక్షన్‌లో ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. బొగ్గు లోడుతో రాకపోకలు సాగించే లారీలు నుంచి బొగ్గు రోడ్లపై పడుతుండడంతో ప్రజలు పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.

February 27, 2026 / 03:32 PM IST

లంకతోటలో ఘనంగా నూతన రామాలయ ప్రతిష్ట

కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు లంకతోట గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు యాగాది క్రతువులు నిర్వహించి, నూతన దేవత విగ్రహాలు ప్రతిష్టించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బంగారు బాబు, శివ పాల్గొన్నారు.

February 27, 2026 / 03:31 PM IST

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన

VZM: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా నియోజకవర్గంలో గల ఆలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలానే, వారికి బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తప్పకుండా బొబ్బిలి రావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు.

February 27, 2026 / 03:30 PM IST

‘కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలి’

కోనసీమ: మార్చి 22వ తేదీన మామిడికుదురులో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలన్న డిమాండ్‌తో ధూమ్ తడక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఈదరాడ గ్రామంలో శుక్రవారం బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయం దగ్గరలో సభ కార్యక్రమం జరుగుతుందన్నారు.

February 27, 2026 / 03:30 PM IST

గుంటూరు జూనియర్ సివిల్ కోర్టుల ఏజీపీగా నాగేంద్రబాబు

గుంటూరు జూనియర్ సివిల్ కోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా సీనియర్ న్యాయవాది మేత్రా నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. నాగేంద్రబాబు నియామకం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

February 27, 2026 / 03:29 PM IST

మదనపల్లె నూతన టూటౌన్ ఎస్సై బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య: మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోనూ ఇక్కడ ఎస్సైగా పనిచేయడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

February 27, 2026 / 03:29 PM IST

అర్థవీడు ఈసీ బెల్లంకొండ కిషోర్ సస్పెండ్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఈసీ బెల్లంకొండ కిషోర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్లుగా చూపించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ఈసీ బెల్లంకొండ కిషోర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ జోసెఫ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కాపురంలో విధులు నిర్వహిస్తున్న ఆయనపై విచారణ కొనసాగుతోంది.

February 27, 2026 / 03:26 PM IST

జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

ELR: కైకలూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్లేటి కోటలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఉత్సవ నిర్వహణ కొరకు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 03:23 PM IST

రాజకీయం శాశ్వతం కాదు.. అభివృద్ధి నా లక్ష్యం: మాజీ MLA

ప్రకాశం: మాజీ MLA అన్నా రాంబాబు మార్కాపురం YCP కార్యాలయంలో మాట్లాడారు. జులై 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని CM ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మీరు చెప్పిన విధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ ప్రాంత ప్రజానీకమంతా రాజకీయంగా మీ వెంట ఉంటామని పేర్కొన్నారు. రాజకీయం శాశ్వతం కాదు.. మా ప్రాంతం అభివృద్ధి చెందడం నా లక్ష్యమని ఆయన తెలిపారు.

February 27, 2026 / 03:20 PM IST

ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

అన్నమయ్య: 1 వ తరగతి ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట MEOలు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. అందుకు సంబంధించి ప్రచార కరపత్రాలను శుక్రవారం వారు విడుదల చేశారు. అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని గ్రామ సచివాలయంలో, మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

February 27, 2026 / 03:11 PM IST

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

WG: ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 03:10 PM IST

పేదల ఆరోగ్యానికి భరోసా CMRF: MLA

KDP: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 54.81 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:10 PM IST