»Irctc Issued New Rules Big Update The Rule Of Sleeping At Night Has Changed In The Train Check The New Guideline
IRCTC : ఇక రాత్రిపూట రైల్లో ఫోన్ మాట్లాడితే అంతే సంగతులు
మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది.
IRCTC : మనం చేసే చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు మీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా ఇలాంటి తప్పు చేయకూడదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. తాజాగా రైల్వేశాఖ చేసిన మార్పు రాత్రిపూట ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించింది.
రైల్వే కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీ సీటు, కంపార్ట్మెంట్, కోచ్‌లో ప్రయాణికులెవరూ మొబైల్లో బిగ్గరగా మాట్లాడకూడదు.. అంతే కాకుండా బిగ్గరగా పాటలు వినకూడదు. ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా రైల్వేశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలా మంది ప్రయాణికులు తమ కోచ్‌లో కలిసి ప్రయాణించే వ్యక్తులు ఫోన్లో బిగ్గరగా మాట్లాడుతున్నారని లేదా అర్థరాత్రి వరకు పాటలు వింటారని తరచుగా ఫిర్యాదు చేశారు. రైల్వే ఎస్కార్ట్ లేదా మెయింటెనెన్స్ సిబ్బంది కూడా గట్టిగా మాట్లాడుతున్నారని కొంతమంది ప్రయాణికుల నుండి ఫిర్యాదు కూడా ఉంది. చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత కూడా లైట్లు వేస్తారు, ఇది వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొత్త నిబంధనను రూపొందించింది. ఇకనుంచి రైలు ప్రయాణికులు ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటారు.
కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకోండి
రైలులో ప్రయాణంలో రాత్రి 10 గంటల తర్వాత మొబైల్లో గట్టిగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం రాత్రి ప్రయాణంలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడకూడదు, సంగీతం వినకూడదు. ప్రయాణికులెవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత రైలులో ఉన్న సిబ్బందిపైనే ఉంటుంది.