TG: మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద రూ. 700 కోట్లతో, 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఆధ్యాత్మికతతో పాటు మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.