Gold Rates Today : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధర
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ వారంలో మొదటి రోజే బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ రీతిలో తగ్గాయి. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఆదివారం రూ.67,520 ఉండగా, సోమవారం నాటికి రూ.345 తగ్గి రూ.67,175కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,175గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) ఆదివారం రూ.76,275 ఉండగా, సోమవారం నాటికి రూ.422 తగ్గి రూ.75,853కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి రూ.300 పైనే తగ్గడం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తగ్గింది. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2156 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 9 డాలర్లు తగ్గి రూ. 2147 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 25.01 డాలర్లుగా ఉంది.