TG: ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు షాక్ ఇచ్చింది. జవాబుపత్రాల పునః పరిశీలన(Re-Verification) ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక్కో పేపర్‌కు రూ.600గా ఉన్న రుసుమును ఏకంగా రూ.800కు పెంచింది. అంటే ప్రతి పేపర్‌కు రూ.200 అదనపు భారం పడనుంది. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని రీ-వెరిఫికేషన్ కోరుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ నిర్ణయం భారంగా మారనుంది.