ఆర్థిక అంశాలపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత.. ఆర్థిక రంగ సంస్థలకు ఉందని RBI డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర రావు అన్నారు. హామీరహిత రుణాల మంజూరు పెరగటం, డెరివేటివ్స్ ట్రేడింగ్‌తో చిన్న మదుపర్లు నష్టాలపాలవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాల కోసం ఆశపడితే ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.