అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ధరలు పెరిగినా దేశీయంగా ధరలు పెంచకపోవడంతో లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు చవిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన IOC, BPCL, HPCL 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.