కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2025 అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తరగతి, బాల్వాటిక 1 నుంచి 3 స్థాయిల్లో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7న ప్రారంభమైంది. మార్చి 21 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అర్హత కలిగిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులు KVS అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.inను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.