TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు.. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షకు 5,09,403 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు.