ఐటీ దిగ్గజం TCS తన అర్హులైన ఉద్యోగులందరికీ జీతాల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రతిభ కనబరిచిన వారికి రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, కంపెనీ లాభం 12 శాతం పెరిగి రూ.13,718 కోట్లకు చేరింది. ఆర్థికంగా దూసుకుపోతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.