ఓపెన్ టెన్త్ అభ్యర్థులకు సులభతరమైన డిజిటల్ సేవను TG ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఓపెన్ స్కూల్ పరీక్షల హాల్ టికెట్లను మీ సేవ అధికారిక వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. APR 10 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం విద్యార్థులు లేదా తల్లి దండ్రులు మీ సేవ అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.