వినియోగదారులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. హోమ్ లోన్ తీసుకునేవారికి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)ను తగ్గించింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. RBI రెపో రేటును 6.25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SBI తెలిపింది.