AP: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈనెల 18 లేదా 19వ తేదీన విడుదల చేయాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాల విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోంది. ఈనెల 16వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఈనెల 18 ఎక్కువశాతం ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫలితాలపై అధికారిక ప్రకటన రానుంది.