దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాయి. సెన్సెక్స్ 851.56 పాయింట్ల నష్టంతో 74,459 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 250.55 పాయింట్లు తగ్గి 22,545 వద్ద కొనసాగుతోంది.