ఒక దేశ కరెన్సీ విలువ వేరే దేశ కరెన్సీతో పోల్చినప్పుడు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, డాలర్ కొనడానికి తక్కువ రూపాయలు ఖర్చయితే మన రూపాయి బలంగా ఉందని అర్థం. అదే ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే రూపాయి బలహీనపడిందని అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల కొనుగోలు, డిమాండ్‌ను బట్టే ఈ కరెన్సీ విలువలలో మార్పులు కనిపిస్తుంటాయి.