AP: రాష్ట్రంలో ఈరోజు నుంచి ఇంటర్ సెకండ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అధికారులు 1,535 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నాపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.