ప్రభుత్వ బీమా సంస్థ LIC పాలసీదారులు, మార్కెటింగ్ ఏజెంట్ల కోసం రెండు యాప్లను తీసుకొచ్చింది. వినియోగదారులకు MyLIC, ఏజెంట్లకు సూపర్ సేల్స్ సారథిని ప్రారంభించింది. యూజర్లు MyLICలోనే బీమా పోర్టుఫోలియోను చెక్ చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించవచ్చు. E-KYC పూర్తి చేయొచ్చు. పాలసీ నుంచి రుణం తీసుకోవచ్చు. కొత్త పాలసీల సమాచారం తెలుసుకోవచ్చు.