డిజిటల్ ప్రకటనల ప్రపంచంలో గూగుల్ ఆధిపత్యానికి మెటా చెక్ పెట్టనుంది. 2026 నాటికి ప్రకటనల ఆదాయంలో మార్క్ జుకర్‌బర్గ్ సంస్థ గూగుల్‌ను అధిగమించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. మెటా ఆదాయం 243.46 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. గతంలో గూగుల్ భారీ ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు మెటా వేగంగా దూసుకుపోతూ నంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది.