హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. యూఎస్ క్రూడ్(వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) బ్యారెల్ ధర 8 శాతం మేర పెరిగి 104.24 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ 7 శాతం మేర పెరిగి 102.29 డాలర్లకు చేరింది. ఇటీవల శాంతి చర్చల వేళ చమురు 95 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి.