తెలంగాణలోని BEd కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EdCET-2026కు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC/ST/PwBDలకు రూ.550. ఈ లోపు అప్లై చేసుకోలేకపోతే రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.500తో 27 వరకు, రూ.1000తో 30 వరకు అప్లై చేసుకోవచ్చు. చివరి అవకాశంగా రూ.5000 దరఖాస్తు ఫీజుతో మే 8-9 తేదీల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12న పరీక్ష జరగనుంది.