ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా ‘S1 X’ మోడల్ బైక్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా ప్రకటించింది. ఈ స్కూటర్లో శక్తివంతమైన 4.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 320 కి.మీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఇది అత్యుత్తమ రేంజ్‌ల్లో ఒకటి కావడం విశేషం.