TG: మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 5.17 లక్షల రెగ్యులర్ విద్యార్థుల్లో సగటున 99% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే 4 సబ్జెక్టుల మూల్యాంకనం, స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. మే తొలి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ నెల 15-16 తేదీల్లో ఓరియంటల్ పరీక్షలున్నా.. వాటిని కొద్ది మందే రాయనున్నారు.