ఎయిరిండియా కోపైలట్ ఒకరు శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడ్డాడు. అతడు ఇటీవల ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శానిఫ్రాన్సిస్కోలో అధికారులు చేసిన తనిఖీల్లో ఆయన బ్యాగ్లో గంజాయి బయటపడింది. దీంతో వారు ఎయిరిండియాకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటనపై డీజీసీఏకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది.