Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైయ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైయ వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి తన యాత్రలో వైఎస్సార్ పేరు ప్రస్తావించటం పైన షర్మిల ఫైర్ అయ్యారు. రేవంత్ ను టార్గెట్ చేస్తూ షర్మిల వరుస ట్వీట్లు చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తీసుకొస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఆనాడు వైఎస్ఆర్ ఆజన్మ శత్రువు అన్నది రేవంత్ రెడ్డి కాదా..? అని షర్మిల ప్రశ్నించారు.
వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. రేవంత్ ఊరూరూ తిరిగి పొర్లు దండాలు పెట్టిన జనం నమ్మరని షర్మిల పేర్కొన్నారు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు అంటూ ఆరోపించారు.
హత్ సే హత్ యాత్ర లో భాగంగా రేవంత్ రెడ్డి జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.