»Women Protest Against Ban On Beauty Parlours Afghanistan
Beauty parlours: బ్యూటీ పార్లర్ల నిషేధంపై మహిళల నిరసన
తాలిబాన్ పాలకులు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల హక్కులపై ఎక్కువగా ఆంక్షలు విధించారు. ఆప్గానిస్తాన్(afghanistan)లో తాజాగా మహిళల బ్యూటీ సెలూన్లపై తాలిబాన్లు నిషేధం పొడిగించిన తరువాత, మహిళా మేకప్ ఆర్టిస్టులు బుధవారం కాబూల్‌లో ఆదేశాన్ని ఖండిస్తూ మహిళలు నిరసనలు చేపట్టారు.
ఆప్గానిస్తాన్(afghanistan)లోని కాబూల్ ఉన్న ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్(beauty parlours)లను నిషేధించారు. మహిళా బ్యూటీ పార్లర్లు, సెలూన్లను మూసివేయాలని తాలిబాన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లోని రాజధాని నగరం కాబూల్‌లో మహిళలు నిరసనను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన నిరసనలో దాదాపు 50 మంది మహిళలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది బ్యూటీ సెలూన్లను మూసివేయడానికి తాలిబాన్లు జూలై 2 నుంచి వ్యాపారాలకు ఒక నెల సమయం ఇచ్చారు. అయితే విగ్గులు ధరించడం, కనుబొమ్మలు తీయడం ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని, పెళ్లయ్యాక తల్లిదండ్రులు బ్యూటీపార్లర్లకు డబ్బు వృథా చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
క్లాస్‌రూమ్‌లు, జిమ్‌లు, పార్కుల నుంచి ఇప్పటికే నిషేధించబడిన ఆఫ్ఘన్ మహిళలకు అందుబాటులో ఉండే స్థలాలను ఈ నిర్ణయం మరింత పరిమితం చేసింది. ఇటీవల తాలిబాన్లు వారు ఐక్యరాజ్యసమితిలో పని చేయకుండా నిషేధించారు. 1996, 2001 మధ్య తాలిబాన్ పాలించినప్పుడు బ్యూటీ సెలూన్లు చివరిసారిగా మూసివేయబడ్డాయి. US బలగాల ఉపసంహరణ తర్వాత రెండు సంవత్సరాల క్రితం తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత అవి తెరిచి ఉన్నాయి. తాలిబాన్ ప్రవేశపెట్టిన చర్యలకు వ్యతిరేకంగా అక్కడక్కడా చిన్నపాటి నిరసనలు జరిగాయి.