రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.
ఎన్నికల సమయంలో (Elections Time) ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మారుస్తున్నాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). మాట ఇస్తే మడమ తిప్పని వంశం అని గొప్పలు చెప్పుకునే జగన్ రాజధాని (Capital) విషయంలో మాట కాదు కదా పద్ధతి కూడా జారాడు. నాడు ఎన్నికల సమయంలో అమరావతిని రాజధాని (Capital Amaravati)గా కొనసాగిస్తాం.. మరింత అభివృద్ధి చేస్తాం అని మాటిచ్చాడు. ఎన్నికల ప్రసంగా (Election Speeches)ల్లో ఇదే అన్నారు. కానీ తీరా జరుగుతోంది ఏమిటి? అంటే రాజధాని మార్చి వేయడం. మూడు రాజధానులు (Three Capitals) అంటూ అమలు కాని విధానాన్ని బలవంతంగా అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అమరావతిని నాశనం చేసి తట్టాబుట్ట సర్దుకుని సుదూరంగా ఉన్న విశాఖపట్టణా (Visakhapatnam) న్ని బయల్దేరుతోంది. మూడు రాజధానుల అంశంపై మొండిగా జగన్ ముందుకు వెళ్తున్నాడు. అహంకారం, తనను ఎవరూ అడ్డుకునేది అనే ధోరణిలో ఆయన విశాఖపట్టణానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పరిపాలన రాజధాని విశాఖకు వెళ్లడంపై ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ మూడు రాజధానుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆలస్యంగా మేల్కొని బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు మంగళవారం సమావేశాలను ప్రారంభించింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రసంగించారు. 2023-24 వార్షిక బడ్జెట్ సందర్భంగా గవర్నర్ కీలక ప్రసంగం చేశారు. అయితే ఆయన ప్రసంగంలో ప్రభుత్వం ప్రకటిస్తున్న మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. మూడు రాజధానులకు పెట్టుకున్న అధికార వికేంద్రీకరణ అనే పదం ఎక్కడా వినిపించలేదు. అయితే మంత్రిమండలి సమావేశాల్లో ఈ అంశంపై మంత్రులు సీఎం జగన్ ను అడిగినట్లు సమాచారం. మూడు రాజధానుల అంశం గవర్నర్ ప్రసంగంలో లేదని విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. విశాఖపట్టణానికి జూలైలో వెళ్తున్నాం అని ప్రకటించారు.
ఈ ప్రకటనను చూస్తుంటే ప్రభుత్వం విశాఖకు మారేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. జూలై నెలలో మంచి రోజు చూసి విశాఖపట్టణంలో అమరావతి మాదిరి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. కాగా జూలైలో తన తండ్రి వైఎస్సార్ జయంతి ఉంది. ఆ రోజే విశాఖకు సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ యంత్రాంగం మకాం మార్చేట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న విశాఖకు వెళ్లనున్నట్లు తెలిసింది. కాగా రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.