»Telangana Ys Vijayamma Also Attack On Police Like Ys Sharmila In Hyderabad
బిడ్డ మాదిరి తల్లి.. Policeపై వైఎస్ విజయమ్మ కూడా దాడి.. తీవ్ర ఉద్రిక్తత
విజయమ్మ కూడా సహనం కోల్పోయారు. నన్నే అడ్డుకుంటారా అని మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. విజయమ్మ చెంప దెబ్బ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు తమపై దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నారు.
తెలంగాణ పోలీసులపై వైఎస్ షర్మిల (YS Sharmila) దాడికి పాల్పడడమే గాక.. ఆమె తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) కూడా దాడికి పాల్పడ్డారు. మహిళా కానిస్టేబుల్ (Constable), ఎస్సైపై (SI) షర్మిల రెచ్చిపోయారు. కారుతో హత్యాయత్నానికి పాల్పడడమే కాకుండా వారిద్దరిపై చేయి చేసుకున్నారు. తమపై దాడికి పాల్పడినందుకు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వార్త తెలుసుకున్న ఆమె తల్లి కూతురిని పరామర్శించేందుకు ఆ సందర్భంలో కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను (SIT) కలిసేందుకు సోమవారం తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బయల్దేరారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను బయటకు వెళ్లకుండా నిలువరించారు. ఈ సమయంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగింది. కానిస్టేబుల్ తో పాటు ఎస్సైపై (Sub Inspector) చేయి చేసుకున్నారు. అంతటితో ఊరుకోకుండా కారును ముందుకు పోనిస్తూ పోలీసులపైకి ఎగదోశారు. ఆమె ప్రవర్తన దురుసుగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తన కుమార్తె అరెస్ట్ (Arrest)తో వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగారు. షర్మిలను పరామర్శించేందుకు వెళ్తానని ఆమె రావడంతో పోలీసులు నిరాకరించారు. ఆమెను రావొద్దని బతిమిలాడారు. ఈ సమయంలో సీఐతో వాగ్వాదానికి దిగారు. ఆమె రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కావడంతో పోలీసులు కారు ఎక్కాలని కోరారు. అయినా ఆమె వినకుండా భీష్మించి నిలబడ్డారు. దీంతో పోలీసులు కారు లోపలికి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విజయమ్మ కూడా సహనం కోల్పోయారు. నన్నే అడ్డుకుంటారా అని మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. విజయమ్మ చెంప దెబ్బ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు తమపై దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.