»Income Tax It Raids On Cm Mk Stalin Family Members And Dmk Leaders Houses
సీఎం MK Stalin లక్ష్యంగా ఐటీ దాడులు.. తమిళనాడులో కలకలం
బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ అంటూ స్టాలిన్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన రెండు మూడు రోజులకే ఈ దాడులు చేయడం గమనార్హం.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు (Central Investigation Agencies) తరచూ దాడులు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల నాయకులు, వారికి మద్దతుగా ఉంటున్న వ్యాపారుల ఇళ్లలో ఐటీ (IT), ఈడీ (ED), సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో (Telangana) అదే తరహాలో దాడులు జరుగుతుండగా.. తాజాగా మరోసారి తమిళనాడులో తనిఖీలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలు తమిళనాడులో (Tamil Nadu) కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులో సోమవారం తెల్లవారుజామున ఆదాయ పన్ను (ఐటీ) (Income Tax- IT) అధికారులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయిన అధికారులు దాదాపు 50 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో ఐటీ అధికారులు దాడులు జరిపారు. సీఎం స్టాలిన్ కుటుంబసభ్యుల ఇళ్లల్లో, అధికార డీఎంకే ఎమ్మెల్యేలు, నాయకుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. అన్నానగర్ డీఎంకే (DMK) ఎమ్మెల్యే మోహన్ (MK Mohan) ఇంట్లో తనిఖీలు చేశారు. దీంతోపాటు అతడి కుమారుడి ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా జీ స్క్వైర్ (G Square) కంపెనీ లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ కంపెనీ డీఎంకే పార్టీకి ఆర్థిక అండదండలు అందిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కంపెనీ చెన్నైలోని (Chennai) ప్రధాన కార్యాలయంతోపాటు ఎండీలు, డైరెక్టర్ల నివాసాల్లో కూడా తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ అంటూ స్టాలిన్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన రెండు మూడు రోజులకే ఈ దాడులు చేయడం గమనార్హం. కాగా ఈ దాడులపై డీఎంకే శ్రేణులు భగ్గుమన్నాయి. ఐటీ దాడులకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలకు దిగారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#WATCH| Tamil Nadu: DMK cadre holds protest after Income Tax raids house of Anna Nagar DMK MLA MK Mohan's son, who is a shareholder of firm G Square pic.twitter.com/Sj3QFC6QBv