»Counter Attack To Amit Shah Bjp Has No Vision Besides Hate Says Asaduddin Owaisi
ఇంకెన్నాళ్లు మాపై ఏడుస్తూనే ఉంటారు? Amit Shahపై అసదుద్దీన్ ఆగ్రహం
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్.. లక్ష్యమంటూ లేదు. బూటకపు ఎన్ కౌంటర్లు, నేరస్తులను విడుదల చేయడం వంటివి మాత్రమే మీ ప్రభుత్వం చేస్తుంది
తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా తమను విమర్శించడంపై ఏఐఎంఐఎం పార్టీ (All India Majlis-e-Ittehadul Muslimeen- AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అసహనం వ్యక్తం చేశారు. నిన్న చేవెళ్ల (Chevella) సభలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు నా మీదే ఏడుస్తారు.. మీరు ప్రజలకు చేసేది చెప్పండి అని హితవు పలికారు. ఇంకెన్నాళ్లు ఈ ఏడుపు అని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలపై ట్విటర్ (Twitter) వేదికగా ఒవైసీ స్పందించారు.
‘హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి ఒవైసీ.. ఒవైసీ అనే ఏడుపు ఇంకెంత కాలం? ఇక నైనా అలాంటి వ్యాఖ్యలు మానేసి ద్రవ్యోల్బణం (Inflation), నిరుద్యోగం (UnEmployment) గురించి మాట్లాడండి. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్.. లక్ష్యమంటూ లేదు. బూటకపు ఎన్ కౌంటర్లు, నేరస్తులను విడుదల చేయడం వంటివి మాత్రమే మీ ప్రభుత్వం చేస్తుంది’ అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇక అమిత్ షా రిజర్వేషన్ల రద్దు ప్రకటనపై స్పందిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 50 శాతం సీలింగ్ కోటాను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు స్టే కింద కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ విషయం మీకు తెలియకపోతే సుధీర్ కమిషన్ నివేదికను పూర్తిగా చదవాలి’ అని అమిత్ షాకు ఒవైసీ సలహా ఇచ్చారు. ‘తెలంగాణ ప్రజలను ఎందుకు అంతలా ద్వేషిస్తున్నారు’ అని ప్రశ్నించారు.
తెలంగాణలో అనధికారికంగా బీఆర్ఎస్ (BRS Party)కు ఎంఐఎం (MIM) మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. చాలా అంశాల్లో బీఆర్ఎస్ కు మజ్లిస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఒక స్థానాన్ని ఎంఐఎంకు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కు అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ కు అక్బరుద్దీన్ ఒవైసీ మిత్రులుగా కొనసాగుతున్నారు. బీజేపీపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ సాగిస్తున్న ఉద్యమానికి ఎంఐఎం బహిరంగ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
Sir @AmitShah ye “owaisi owaisi” ka rona kab tak chalega? Khaali khattey dialog’aan maarte rehte. Please sometimes speak about record-breaking inflation & unemployment also. Telangana has the highest per capita income in the country