»Audience Attack On Asian Lakshmikala Theatre Due To Not Screening Virupaksha Movie
ప్రేక్షకుల రచ్చరచ్చ .. Virupaksha సినిమా వేయలేదని Theatreలో బీభత్సం
సినిమా వేయకపోవడంతో థియేటర్ యాజమాన్యం స్పందించింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు (Return) చెల్లించారు. అయితే ఆ టికెట్ లో జీఎస్టీ, పార్కింగ్ ఫీజు పట్టుకుని మిగిలిన కొంచెం తమకు ఇచ్చారని ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు. అయితే సినిమా ఎందుకు వేయలేదని విషయం మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు.
రోడ్డు ప్రమాదం తర్వాత ‘విరూపాక్ష’ సినిమాతో (Virupaksha Movie) వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ (Sai Dharam Tej) మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విరూపాక్ష సినిమాకు ప్రేక్షకుల ( నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శన ఓ థియేటర్ లో ఆలస్యం కావడంతో ప్రేక్షకులు బీభత్సం సృష్టించారు. గంట సేపైనా సినిమా వేయకపోవడంతో సహనం కోల్పోయిన ప్రేక్షకులు (Audience) థియేటర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది.
హైదరాబాద్ (Hyderabad) మూసాపేటలో ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ (Asian Lakshmikala )లో విరూపాక్ష సినిమా ప్రదర్శితమవుతోంది. ఫస్ట్ షో 6 గంటలకు ప్రారంభం కావాలి. టికెట్లు తీసుకెళ్లి లోపలికి వెళ్లిన ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఎంతకీ సినిమా (Movie) వేయలేదు. దాదాపు గంటన్నర సేపు వేచి ఉన్నా బొమ్మ పడకపోవడంతో ప్రేక్షకుల్లో ఆగ్రహావేశాలు వచ్చాయి. థియేటర్ లోపల సీట్లు చించేశారు. బయటకు వచ్చి అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు (Police) ప్రేక్షకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
కాగా, సినిమా వేయకపోవడంతో థియేటర్ (Theatre) యాజమాన్యం స్పందించింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బులు (Return) చెల్లించారు. అయితే ఆ టికెట్ లో జీఎస్టీ, పార్కింగ్ ఫీజు పట్టుకుని మిగిలిన కొంచెం తమకు ఇచ్చారని ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు. అయితే సినిమా ఎందుకు వేయలేదని విషయం మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ (Samyuktha menon) నటించిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న విడుదలైన విషయం తెలిసిందే. తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.