»Twitter Restoring Blue Tick For Users With 1 Million Followers Like Virat Kohli Rahul Gandhi
Twitter U Turn మళ్లీ బ్లూ టిక్ వచ్చేసింది.. Million ఫాలోవర్లు దాటిన వారికే
చందా చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా చెల్లించలేదని తెలుస్తోంది.
కొన్ని రోజుల కిందట ఏప్రిల్ 20వ తేదీన అకస్మాత్తుగా ప్రముఖుల ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue Tick) అకస్మాత్తుగా మాయమైంది. ప్రముఖులు, వీవీఐపీల ఖాతాలకు కూడా బ్లూ టిక్ తొలగిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పక్షపాత ధోరణితో ట్విటర్ (Twitter) వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మూడు రోజుల తర్వాత ట్విటర్ పునరుద్ధరణ (Restored) చర్యలు చేపట్టింది. భారతదేశానికి చెందిన ప్రముఖుల (VVIPs) ట్విటర్ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్ ను పునరుద్ధరించింది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, రాహుల్ గాంధీ (Rahul Gandhi), సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ (Virat Kohli), ఎంఎస్ ధోనీ, డొనల్ట్ ట్రంప్, బిల్ గేట్స్ తో పాటు సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల బ్లూ టిక్ పునరుద్ధరణ చేశారు.
చందా చెల్లించి సబ్ స్క్రైబ్ (Subscribe) చేసుకోని కారణంగా వారందరి బ్లూ టిక్ లు తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా వాటిని పునరుద్ధరించింది. వారి ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విటర్ జోడించింది. అయితే ఈ బ్లూ టిక్ కోసం ఆ ప్రముఖులందరూ చందా (Payment) చెల్లించలేదని తెలుస్తోంది. ఎందుకంటే లక్షలాది (Million) మంది ఫాలోవర్లు (Followers) ఉండడంతో వారి ఖాతాలకు బ్లూ టిక్ పునరుద్ధరణ చేసింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నవారికి సబ్ స్క్రైబ్ చేసుకోకున్నా బ్లూ టిక్ అందిస్తోందని తెలుస్తున్నది. బ్లూ టిక్ పునరుద్ధరణపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు. ‘చందా కట్టకున్నా ఆదివారం బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది. మస్క్ మీరే నా తరఫున చందా రుసుము చెల్లించారా’ అని అబ్దుల్లా ట్విటర్ ప్రశ్నించారు. కాగా చనిపోయిన ప్రముఖుల ఖాతాలకు కూడా బ్లూ టిక్ పునరుద్ధరణ కావడం గమనార్హం. సుష్మా స్వరాజ్(Sushma Swaraj), సుశాంత్ రాజ్ పుత్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, రిషి కపూర్, మైకేల్ జాక్సన్, చాడ్విక్ బోస్ మ్యాన్, కోబె బ్రయాంట్, షేన్ వార్న్ (Shane Warne) తదితర ప్రముఖుల ఖాతాలకు ఈ టిక్ కనిపించింది.